TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సీఎం చంద్రబాబు హెలికాప్టర్ లో సాంకేతిక లోపం

Published on: Mon Jun 16, 2025 5:32PM

ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జిల్లాల పర్యటన కోసం ఉపయోగించే హెలికాప్టర్ లో సాంకేతిక సమస్య తలెత్తింది. ఇదే హెలికాప్టర్ ను రాష్ట్రపర్యటనలో కేంద్ర మంత్రి పియూష్ గోయెల్  కోసం కేటాయించారు. ఆయన తిరుపతి నుంచి కృష్ణపట్నం వెళ్లేందుకు సోమవారం (జూన్ 16) హెలికాప్టర్ వినియోగించాల్సి ఉంది.

అయితే తీరా ఆయన హెలికాప్టర్ ఎక్కిన తరువాత సాంకేతిక సమస్య ఉత్పన్నం కావడంతో ఆయన తన పర్యటనను రద్దు చేసుకుని ఢిల్లీ తిరిగి వెళ్లిపోయారు. అదలా ఉంటే  సీఎం చంద్రబాబు జిల్లా పర్యటనలకు  వాడే హెలికాప్టర్లో సాంకేతిక సమస్య తలెత్తడం పట్ల ఆందోళన వ్యక్తం అవుతోంది.  అధికారులు అలర్ట్ అయ్యారు. ఈ హెలికాప్టర్ వినియోగంపై నివేదిక ఇవ్వాల్సిందిగా ఏపీ డీజీపీ ఇంటెలిజెన్స్ చీఫ్ ను ఆదేశించారు.