కివీస్ తో నాలుగో టి20.. హార్ధిక్ పాండ్యాకు రెస్ట్
Published on: Tue Jan 27, 2026 4:54PM
.webp)
న్యూజిలాండ్ తో విశాఖపట్నం వేదికగా బుధవారం (జనవరి 28) జరగనున్న నాలుగో టి20 మ్యాచ్ కు టీమ్ ఇండియా స్టార్ ఆల్ రౌండర్ హార్డిక్ పాండ్యా దూరం కానున్నారు. ఇప్పటికే ఐదు టి20ల సిరీస్ లో తొలి మూడు వన్డేలలోనూ విజయం సాధించి మరో రెండు మ్యాచ్ లు మిగిలి ఉండగానే సిరీస్ ను కైవసం చేసుకున్న టీమ్ఇండియా ఇక ప్రయోగాలకు రెడీ అయ్యింది.
ఈ మ్యాచ్ లో ఆల్ రౌండర్ హార్డిక్ పాండ్యాకు రెస్ట్ ఇవ్వాలని నిర్ణయించింది. మూడో వన్డేలో అవకాశం దక్కని స్పెషలిస్ట్ స్పిన్నర్ ను వరుణ్ చక్రవర్తిని తుది జట్టులోకి తీసుకురావాలని టీమ్ మేనేజ్ మెంట్ నిర్ణయించింది. అలాగే స్టార్ పేసర్ బూమ్రాకు కూడా రెస్ట్ ఇచ్చే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. మొత్తం మీద కివీస్ ను క్లీన్ స్వీప్ చేసి టి20 వరల్డ్ కప్ కు ముందు ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసుకోవాలన్న పట్టుదలతో టీమ్ ఇండియా ఉంది. కాగా న్యూజిలాండ్ నాలుగో టి20లో విజయం సాధించి పరాజయాల పరంపరకు బ్రేక్ వేయాలన్న లక్ష్యంతో బరిలోకి దిగనుంది.


