సిరీస్ పై టీమ్ ఇండియా కన్ను.. న్యూజిలాండ్ తో చివరి టి20 నేడే
Published on: Tue Nov 22, 2022 10:34AM
న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడు టి20ల సిరీస్ లో ఇప్పటికే భారత్ 1-0 ఆధిక్యతతో ఉంది. చివరిదైన మూడో వన్డే మంగళవారం (నవంబర్ 21)న జరగనుంది. సీనియర్లకు విశ్రాంతి ఇచ్చిన ఈ సిరీస్ లో తొలి మ్యాచ్ వర్షార్పణం అయిన సంగతి విదితమే. రెండో మ్యాచ్ లో టీమ్ ఇండియా న్యూజిలాండ్ పై సునాయాస విజయం సాధించింది. సూర్యకుమార్ ఆకాసమే హద్దుగా చెలరేగి అజేయ శతకం చేయడంతో టీమ్ ఇండియా 65 పరుగుల భారీ ఆధిక్యతతో విజయం సాధించింది. ఇక చివరిదైన మూడో టి20 మ్యాచ్ లో కూడా విజయం సాధించి 2-0తో సిరీస్ కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో ఉంది.
మరో వైపు న్యూజిలాండ్ ఎలాగైనా సిరీస్‌ను సమం చేయాలన్న పట్టుదలతో ఉంది. అయితే.. ఆ జట్టు.. కెప్టెన్ కేన్ విలియమ్సన్ వ్యక్తిగత కారణాలతో ఈ మ్యాచ్ కు అందుబాటులో ఉండటంలేదు. దీంతో సౌథీ సారథ్యంతో న్యూజిలాండ్ ఈ మ్యాచ్ లో బరిలోకి దిగుతోంది.
భారత్ విజయం సాధించిన మ్యాచ్ లో న్యూజిలాండ్ కు, భారత్ కు ఉన్న ఒకే ఒక తేడా సూర్య కుమార్ యాదవ్. సూర్యకుమార్ యదవ్ విజృంభణే మ్యాచ్ ఫలితం టీమ్ ఇండియాకు అనుకూలంగా వచ్చేలా చేసింది. సూర్యకుమార్ యాదవ్ ను మినహాయిస్తే మిగిలిన బ్యాటర్లంతా విఫలమయ్యారు. మంగళవారం (నవంబర్ 21) జరిగే మ్యాచ్ లో కూడా సూర్య కుమార్ యాదవ్ మ్యాజిక్ రిపీట్ చేస్తే టీమ్ ఇండియాకు తిరుగే ఉండదు. అయితే మిగిలిన బ్యాటర్లు కూడా ఫామ్ అందిపుచ్చుకోవాలని టీమ్ ఇండియా ఆశిస్తోంది.
ముఖ్యంగా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ పామ్ అందిపుచ్చుకుని రాణించాల్సి ఉంది. రెండో మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే ఈ మ్యాచ్‌లోనూ భారత్ బరిలోకి దిగే అవకాశం ఉంది. అదే జరిగితే మరోసారి సంజు శాంసన్, ఉమ్రాన్ మాలిక్, శుభ్‌మన్ గిల్‌లు బెంచీకే పరిమితం కాకతప్పదు. మార్పులు చేయాలని భావిస్తే శ్రేయాస్ స్థానంలో సంజుకు అవకాశం ఇవ్వొచ్చు. కెప్టెన్‌గా తనదైన ముద్ర వేయాలని భావిస్తున్న హార్ధిక్ తుది జట్టులో ఎవరికి చోటు ఇస్తాడో చూడాల్సిందే.


