TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. జింబాబ్వేపై టీమిండియా సునాయాస విజయం.!

Published on: Fri Jul 24, 2026 6:46AM

జింబాబ్వేతో మూడు టి20ల సిరీస్ లో భాగంగా గురువారం జరిగిన తొలి మ్యాచ్ లో టీమ్ ఇండియా సునాయాస విజయం సాధించింది.  హరారే వేదికగా జరిగి ఈ మ్యాచ్ లో జింబాబ్వేపై  7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.  

 టాస్ గెలిచిన టీమ్ ఇండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముందుగా బ్యాటింగ్ చేసిన జింబాబ్వే.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. భారత బౌలర్లలో మయాంక్ 18 పరుగులు ఇఛ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.  అలాగే ప్రిన్స్ యాదవ్  19 పరుగులిచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు.   వీరిద్దరి ధాటికి జింబాబ్వే ఒక దశలో  32 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయింది. అయితే ఆ తరువాత..  వెస్లీ మధెవెరె 39 పరుగులు, తడివానశే మరుమాని   27 పరుగులు చేసి కాసేపు ప్రతిఘటించారు.  

126 పరుగుల సునాయాస విజయ లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన టీమ్ ఇండియా   ఆరంభంలోనే  ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 1 పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు.

అయితే ఆ ఆనందం జింబాబ్వేకు ఇసుమంతైనా దక్కనీయకుండా.. బేబీ బాస్ వైభవ్ సూర్యవంశి తన బ్యాట్ తో జింబాబ్వే బౌలర్లను ఊచకోత కోశాడు.   కేవలం 19 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్లతో  అర్ధశతకం సాధించాడు.   అతనికి తోడుగా ఇషాన్ కిషన్ 35 పరుగులతో బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరూ ఔటైన తర్వాత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 28 పరుగులతో నాటౌట్‌గా నిలవగా, తిలక్ వర్మ 6 పరుగులతో నాటౌట్‌గా ఉండి లక్ష్యాన్ని ఛేదించారు. టీమ్ ఇండియా  13.2 ఓవర్లలోనే 3 వికెట్లు   కోల్పోయి లక్ష్యాన్నిఛేదించింది.

Vaibhav Suryavanshi, India vs Zimbabwe T20, Team India Victory, Mayank Yadav, Harare T20 Match, Ishan Kishan