Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...టి 20 వరల్డ్ కప్ విన్ లో.. టీమిండియా రికార్డులివే!
posted on: Mar 9, 2026 6:47AM

అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఆదివారం (మార్చి 8) జరిగిన టి20 వరల్డ్ కప్ 2026ఫైనల్స్ లో 96 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ను చిత్తు చేసి టోర్నీ విజేతగా నిలిచిన టీమ్ ఇండియా ఈ క్రమంలో పలు రికార్డులు బ్రేక్ చేసింది. ఈ విజయంతో టీ20 వరల్డ్ కప్ చరిత్రలో వరుసగా రెండు సార్లు ట్రోఫీని గెలుచుకున్న తొలి జట్టుగా రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకూ ఏ దేశం కూడా టైటిల్ ని ఇలా నిలబెట్టుకోలేకపోయింది. ఈ చారిత్రాత్మక విజయంతో టీమ్ ఇండియా 2007, 2024, 2026 లో మొత్తం మూడు సార్లు టి20 వరల్డ్ కప్ చాంపియన్ గా నిలిచింది. దీంతో రెండు వరల్డ్ కప్ లు సాధించిన వెస్టిండీస్, ఇంగ్లండ్ రికార్డులను బ్రేక్ చేసింది భారత్.
అలాగే టి20 వరల్డ్ కప్ ఫైనల్ లో ఇప్పటి వరకూ అత్యధిక పరుగులు చేసిన జట్టుగా ఆస్ట్రేలియా పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేసింది. ఇప్పటి వరకూ 2021లొఆస్ట్రేలియా చేసిన 173 పరుగులే ఫైనల్స్ లో హయ్యస్ట్. అయితే టీమ్ ఇండియా ఆ రికార్డును తుడిచిపెట్టేసి . ఏకంగా ఐదు వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసి కొత్త రికార్డు సృష్టించింది.
టీ20 వరల్డ్ కప్ లో ఒక బ్యాట్స్ మన్ చేసిన హయ్యస్ట్ స్కోర్ గతంలో మార్లన్ శామ్యూల్స్ చేసిన 85 పరుగులే అత్యధికంగా ఉండేది. ఇప్పుడా రికార్డు సంజూ శాంసన్ పేరిట నమోదైంది. మొత్తం 89 పరుగులతో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ ట్రోఫీని అందుకున్నాడు శాంసన్. ఒకే వరల్డ్ కప్ ఎడిషన్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు కూడా నమోదు చేశాడు సంజూ. అలాగే పవర్ ప్లేలో ఈ ఫైనల్ లో టీమ్ ఇండియా చేసిన పరుగులు టీ 20 వరల్డ్ కప్ చరిత్రలో జాయింట్ హయ్యస్ట్ పవర్ ప్లే స్కోర్.
ఇక పోతే హోం గ్రౌండ్ సెంటిమెంటును కూడా తిరగ రాసింది టీమిండియా. సొంత గడ్డపై వరల్డ్ కప్ గెలిచిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది భారత్. మొత్తంగా మనకు మరో వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ గా నిలిచాడు సూర్యకుమార్ యాదవ్.






