TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చంద్రబాబు, అశోక్‌బాబులే బెటర్.. జ‌గ‌న‌న్న‌, సంఘాల నేత‌ల‌పై ఉద్యోగులు ఫైర్‌..

Published on: Wed Feb 9, 2022 2:59PM

పీఆర్సీపై ప్రస్తుత సీఎం వైయస్ జగన్ కంటే నాటి సీఎం చంద్రబాబు నాయుడే బెటర్ అనే చర్చ ఉద్యోగ సంఘాల్లో నడుస్తోంది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు రెండు వ‌ర్గాలుగా చీలిపోయి.. తమ తమ వాదనలను వినిపిస్తున్నారు. టీచ‌ర్లు క్ర‌మంగా ఉద్య‌మ‌ తీవ్ర‌త పెంచుతున్నారు. 

చీక‌టి జీవోల ఉపసంహ‌ర‌ణ లేకుండా ఏ విధంగా చ‌ర్చ‌ల‌కు ఒప్పుకున్నారంటూ ఆ నలుగురు నాయకులను ఉపాధ్యాయ సంఘాలు సూటిగా ప్రశ్నిస్తున్నాయి. ప్రభుత్వ చర్చల్లో పాల్గొన్న బండి శ్రీ‌ను, కేఆర్ సూర్య‌నారాయ‌ణ‌, వెంక‌ట్రామి రెడ్డి, బొప్ప‌రాజు వెంకటేశ్వ‌ర్లు త‌మ‌కు అన్యాయం చేశార‌ని టీచ‌ర్లు మండిప‌డుతున్నారు. 

ఈ సంద‌ర్భంగా ఉద్యోగులంతా గ‌తాన్ని గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఏపీ ఎన్జీవో అధ్యక్షుడిగా ఉన్న పరుచూరి అశోక్ బాబు ఉద్యోగుల కోసం అనుకున్నవన్నీ సాధించుకుని వచ్చారని పాత జ్ఞాప‌కాల్లోకి వెళ్తున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి వైయస్ జగన్, నాటి సీఎం చంద్రబాబు మధ్య ఉన్న తేడాను సైతం ఉద్యోగ‌, ఉపాధ్యాయులు చర్చించుకుంటున్నారు. చంద్ర‌బాబు ప్రభుత్వ హ‌యాంలో తాము 43 శాతం ఫిట్‌మెంట్ పొందామ‌ని, అదే విధంగా 20 శాతం హెచ్ఆర్‌ను శ్రీ‌కాకుళం, చిత్తూరు, మ‌చిలీప‌ట్నం లాంటి ప్రాంతాలలో ల‌క్ష జ‌నాభా లేక‌పోయినా కూడా అంగీకరించార‌ని అంటున్నారు. 10వ పీఆర్సీలోని పాత బకాయిలను కూడా ఇప్పించారని వారు చెబుతున్నారు. అలాగే సమైక్యాంధ్ర ఉద్య‌మ సమయంలో ఆందోళనలు చేసిన 81 రోజుల‌ను.. నాడు చంద్రబాబు ప్రభుత్వం స్పెష‌ల్ లీవ్‌గా ప‌రిగ‌ణించి.. తమకు ఆర్థిక ప్ర‌యోజ‌నాలను అందించిందని ఉద్యోగులంతా గుర్తు చేసుకుంటున్నారు. ఏ విధంగా చూసుకున్నా చంద్రబాబే త‌మ దృష్టిలో సూప‌ర్ సీఎం అని వారంతా అంటున్నారు. 

ప్ర‌స్తుత పీఆర్సీ అన్ని విధాలా త‌మ‌కు న‌ష్ట‌మేనంటూ మ‌రోమారు ఉపాధ్యాయులు రోడ్డెక్కేందుకు సిద్ధం అవుతున్నారు. ఇటీవల చ‌లో విజ‌య‌వాడ‌ను విజయవంతం చేసిందే తామని ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. టీచర్ అంటే ఫ్లవర్ అనుకుంటివా.. కాదు ఫైర్ అని మరోసారి గుర్తు చేసేందుకు.. కాంట్రాక్టు లెక్చ‌ర‌ర్లు, ఔట్ సోర్సింగ్ సిబ్బందితో క‌లిసి ఉద్య‌మించేందుకు కార్యాచ‌ర‌ణ‌ను రూపొందించేందుకు ఉపాధ్యాయ సంఘాలు రెడీగా ఉన్నాయి.