TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పిల్లల ముందే టీచర్ హత్య

Published on: Thu Apr 16, 2015 2:57PM

 

పిల్లలు ముందే టీచర్ హత్య అర్జెంటీనాలో ఓ దారుణమైన ఘటన జరిగింది. ఓ వ్యాపారి తన మాజీ భార్యను కత్తితో దారుణంగా పొడిచి చంపేశాడు. వివరాల ప్రకారం అర్జెంటీనాలో కొరడోబా ప్రావిన్స్ లో 44 ఏళ్ల వయసున్న మహిళ ఓ చిన్నపిల్లల సంరక్షణ కేంద్రంలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తుంది. ఆమె సంరక్షణ కేంద్రంలో ఉన్న సమయంలో ఆమె మాజీ భర్త వెళ్లి చిన్నారుల ఎదుటగానే ఆమెను అతి దారుణంగా కత్తితో పొడిచి చంపేశాడు. దీంతో అక్కడ ఉన్న చిన్నారులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. పోలీసులు వ్యాపారిని అరెస్ట్ చేసి అతను హత్య చేయడానికి గల కారణాలు గురించి దర్యాప్తు చేస్తున్నారు.