TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

టీచర్‌పై సామూహిక అత్యాచారం

Published on: Mon Sep 1, 2014 3:31PM

 

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం మానభంగాలకు అడ్డాగా మారిపోయింది. సోమవారం నాడు ఒక ఉపాధ్యాయురాలిని దుండగులు కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం చేశారు. ఆమె దగ్గర వున్న విలువైన వస్తువులు దోచుకెళ్లారు. యూపీలోని భోన్గాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగ్లా మధు గ్రామంలో ఈ సంఘటన జరిగింది. బాధిత మహిళ స్కూలుకు వెళ్తున్న సమయంలో ముగ్గురు దుండగులు ఆమెపై దాడి చేశారు. ఆమె నుంచి బంగారు చైన్, ఐదు వేల రూపాయల నగదు దోచుకున్నారు. అనంతరం సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. టీచర్ కేకలు విన్న స్థానికులు ఓ నిందితుడి పట్టుకుని పోలీసులకు అప్పగించారు.