టీడీపీ కార్యకర్త దారుణ హత్య..
Published on: Fri Feb 5, 2016 9:47AM

అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు. వివరాల ప్రకారం తెదేపా కార్యకర్త రమణది కళ్యాణదుర్గం మండలం ముసికొట్టాల తాండా. కాగా అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం సమీపంలో రమణ హత్యకు గురయ్యాడు. అటుగా వెళ్తున్న స్థానికులు ఈరోజు ఉదయం రమణ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. హత్యకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.


