TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

వైసిపి ఎంపీకి షాక్.. సొంత ఊరిలో టీడీపీకి ఏకగ్రీవం..

Published on: Tue Feb 9, 2021 4:52PM

ఏపీలో పంచాయతీ ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్న సంగతి తెల్సిందే. ఈ రోజూ జరిచిన తొలివిడత పోలింగ్ కొద్దిసేపటి క్రితం ముగిసింది. మరోపక్క ఓట్ల కౌంటింగ్ ఉద మొదలైంది. ఈ సాయంత్రం లోపు ఫలితాలు వెలువడనున్నాయి. ఈరోజు జరిగిన పోలింగ్ లో అక్కడక్కడా చెదురుముదురు ఘటనలు మినహా అంతా సజావుగా సాగింది. ఇదిలా ఉండగా... రాష్ట్రంలోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర ముఖ్య నాయకులూ తమ సొంత గ్రామాలపై దృష్టి పెట్టారు. మరోపక్క ప్రతిపక్ష టీడీపీ కూడా ఈ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది .

ఇది ఇలా ఉండగా అనంతపురం జిల్లా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ సొంత ఊరు కర్నూలు మండలం పి. రుద్రవరంలో టీడీపీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి ఎంకే మధు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ఎన్నికల రిటర్నింగ్ అధికారి మధుకు ఎన్నిక ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. ఈ ఊరిలో 10 వార్డుల్లో మొతం 1154 మంది ఓటర్లున్నారు. సర్పంచ్ స్థానాలకు మొదట ఐదుగురు నామినేషన్ దాఖలు చేయగా చివరకు నలుగురు పోటీ నుంచి తప్పుకొన్నారు. దీంతో మధు సర్పంచ్ గా ఏకగ్రీవమైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.