ఒక పరాజయం 100 తప్పులు.. మల్లెపూల గురించి మాట్లాడేవారు అధికార ప్రతినిధులా?

 

నాయకులు చేసే పనులు మాత్రమే కాదు, వారి మాటలు కూడా.. వారి మీద, వారి పార్టీ మీద తీవ్ర ప్రభావం చూపుతాయి. అందుకే నాయకులకు నాలుక అదుపులో ఉండాలి. ఏదైనా మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడాలి. కానీ టీడీపీ అధికార ప్రతినిధులు ఈ విషయాన్ని మరచి మీడియా ముందు నోటికొచ్చినట్లు వాగి పార్టీ ప్రతిష్టను దెబ్బ తీశారు. అలాంటి వారిని పార్టీ అధికార ప్రతినిధులుగా ఎంపిక చేసిన చంద్రబాబు పెద్ద తప్పు చేశారు. ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారు.

అసలు పార్టీ అధికార ప్రతినిధులంటే ఎలా ఉండాలి? పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. కార్యకర్తలను ఉత్తేజ పరిచేలా ప్రసంగించాలి. కానీ టీడీపీ అధికార ప్రతినిధులు ఎలా ఉన్నారు?. బాబు, లోకేష్ లకు భజన చేయడం, ఇతర పార్టీ నేతలను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడం, బూతులు తిట్టడం. వీళ్లా అధికార ప్రతినిధులు?. యామిని సాధినేని ఏమో మల్లెపూలు అంటారు, సీఎం రమేష్ 'నీ అమ్మ' అంటారు, రాజేంద్ర ప్రసాద్ ఏమో ప్రతిపక్ష నేత మీద దాడి జరిగితే వాళ్ళ అమ్మ, చెల్లెలే చేశారు అంటారు. ఇలా వీరు నోరు అదుపులోలేకుండా మాట్లాడిన మాటలు కోకొల్లలు.

బూతులు మాట్లాడేవారు, వ్యక్తిగతంగా విమర్శలు చేసే వారు అధికార ప్రతినిధులా? అసలు వీరికి ఏ అర్హత ఉందని అధికార ప్రతినిధులుగా నియమించారు?. బాబుకి, లోకేష్ కి డప్పు కొట్టడమేనా వీరికున్న అర్హత?. గతంలో టీడీపీ శిక్షణ తరగతులు నిర్వహించేది. పార్టీ పట్ల నిబద్ధత ఉన్నవారిని, అద్భుతంగా ప్రసంగించే వారిని అధికార ప్రతినిధులుగా నియమించేవారు. కానీ ఇప్పుడు.. బాబు, లోకేష్ లు మెచ్చేవారు, వాయిద్దరికి భజనచేసేవారు అధికార ప్రతినిధులు అయ్యారు. వారేం చేశారు?. నోటిదూలతో పార్టీ ప్రతిష్ట దెబ్బదీసారు, ప్రజల్లో పార్టీపై చులకన భావం వచ్చేలా చేశారు. మొత్తానికి పార్టీ ఓటమికి కారణమయ్యారు.