Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఆహ్వానం వైసీపీది.. స్వాగతం టీడీపీది! తగ్గేదేలే అంటున్న తెలుగు తమ్ముళ్లు
posted on: May 5, 2022 4:16PM
తెరాస మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఏ ముహూర్తంలో ఏపీలో జగన్ ఏటుబడిలో విద్యుత్, రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది అన్నారో కానీ.. రోజు రోజుకూ ఆయన మాటలు అక్షర సత్యాలనడానికి నిదర్శనాలు పెరిగిపోతున్నాయి. తాజాగా డిస్కమ్ లు దివాళా అంటూ జగన్ సర్కార్ చేతులెత్తేసింది. వైసీపీ నేతలు కేటీఆర్ కు విసిరిస సవాల్ ను తెలుగుదేశం సీరియస్ గా తీసుకుంది. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని కనులారా చూద్దురు గాని రండి అంటూ ఆహ్వానం పలికిన వైసీపీ మంత్రులు ఆ తరువాత మళ్లీ ఆ ఊసెత్తడం లేదు. మాట వరసకు వందల బస్సుల్లో రండి రాష్ట్రంలో అభివృద్ధి ‘వెలుగులు’ చూపుతాం అని ఓ సవాల్ విసిరి వదిలేశారు. మళ్లీ మళ్లీ సవాల్ చేస్తే తెలంగాణ నుంచి మంత్రులు బస్సులేసుకు వచ్చేస్తారేమోనని భయపడినట్లు ఉన్నారు. ఒక వైపు డబ్బులు లేవు మహప్రభో అంటూ కోర్టులకు విన్నపాలు చేసుకుంటూ చెల్లింపులను చెల్లు చేసేయాల్సిందిగా కోరుతూ.. మరో వైపు అభివృద్ధి పరుగులు అంటూ పొరుగు రాష్ట్రం మంత్రులకు సవాల్ చేయడం వైసీపీకే చెల్లింది. జగనన్న మాటల్లాగే ఈ సవాల్ కూడా నాలుక చివర నుంచి వచ్చిందే తప్ప.. పొరుగు రాష్ట్రం మంత్రులకు నిజంగా ఆహ్వానం పలికే దమ్మూ ధైర్యం వైసీపీ మంత్రులకు లేదన్న నిశ్చితాభిప్రాయంతో ఉన్న తెలుగుదేశం.. ముందుకు వచ్చి ఆహ్వానం వైసీపీది అయితేనేం.. మే స్వాగతిస్తున్నాం రండి అంటూ పొరుగు రాష్ట్రానికి స్వాగతం పలికింది.
మీరు రావడం కాదు మేం తీసుకువస్తామంటూ ముందుకు వచ్చింది. ఒక్క తెలంగాణ నుంచే కాదు.. ఆ రాష్ట్రానికి పొరుగున ఉన్న రాష్ట్రాల నుంచీ, ఇంకా కావాలంటే దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచీ నేతలు, ప్రముఖులను తీసుకువచ్చి రాష్ట్రంలో ‘వెలిగిపోతున్న’ అభివృద్ధిని చూపిస్తామంటోంది.ఈ మేరకు తెలుగుదేశం నాయకుడు బుద్ధా వెంకన్న బహిరంగ ప్రకటన చేశారు. రాష్ట్రంలో పరిస్థితులను దగ్గరుండి మరీ చూపిస్తామని చెబుతున్నారు. సీపీఐ నాయకుడు నారాయణ అయితే ఒక అడుగు ముందుకు వేసి రాష్ట్ర పరిస్థితులను వీడియో తీసి సామాజిక మాధ్యమంలో పోస్టు చేసేశారు.
ఏపీలో రోడ్ల పరిస్థితి, పాలనా వైఫల్యాలు .. విధాన లోపాలను బయటపెట్టే ఉద్దేశంతో వైసీపీ నేతల ఆహ్వానాన్నే ఉపయోగించుకోవాలని తెలుగుదేశం కీలక నిర్ణయం తీసుకుంది. ఇతర రాష్ట్రాల నేతలను ఏపీకి తీసుకొచ్చి వారికి రాష్ట్ర పరిస్థితులను చూపి సమస్యల తీవ్రత ను లోకానికి తెలియజేయాలని యోచిస్తోంది. ఈ యోచనను తెలుగుదేశం కార్యరూపంలోనికి తీసుకువస్తే వైసీపీకి రాజకీయంగా భారీ నష్టం జరుగుతుంది. టీడీపీ దూకుడు చూసి వైసీపీ మంత్రులు ఎందుకు సవాల్ చేశామురా భగవంతుడా అని తలలు పట్టుకుంటున్నారు.






