తెలంగాణలో బాబు గట్టెక్కుతారా?
Published on: Mon Oct 22, 2012 8:20AM
.png)
రాయలసీమలో పాదయాత్రను విజయవంతంగా పూర్తి చేసుకున్న చంద్రబాబు నాయుడు ఇక తెలంగాణలో కాలు మోపనున్నారు. వస్తున్నా... మీకోసం యాత్రలో ఇది కీలక ఘట్టం కానున్నది. సోమవారం ఆయన మహబూబ్‌నగర్ జిల్లా వడ్డేపల్లి మండలంలో సుంకేశుల డ్యాం వద్ద పాదయాత్ర చేపట్టనున్నారు. తెలంగాణపై వైఖరి చెప్పకపోతే చంద్రబాబు పాదయాత్రను అడ్డుకుంటామని తెలంగాణ వాదులు ఇప్పటికే ప్రకటించారు. తెలంగాణ విషయంలో పార్టీ ప్రకటించిన వైఖరి పట్ల తెలంగాణ వాదులు సంతృప్తి చెందడం లేదు. ఈ నేపధ్యంలో చంద్రబాబు పాదయాత్ర సాగనున్నది. నిజానికి పాలమూరుతో చంద్రబాబుకు చాలా అనుబంధం వుంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కొన్ని ప్రణాళికలు రూపొందించారు. అందులో భాగంగా తెలంగాణలో బాగా వెనుకబడిన మహబూబ్‌నగర్ జిల్లాను చంద్రబాబు ప్రభుత్వం దత్తత తీసుకుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకొని పాలమూరు ప్రజలు బాబును ఆదరిస్తారా లేదా అనేది చూడాలి.


