మొదటి సంతకం రైతుల రుణాల మాఫీకే
Published on: Thu Oct 18, 2012 12:03PM
.png)
అరవైమూడు ఏళ్ల వయస్సులో కూడా రెట్టించిన ఉత్సాహంతో పాదయాత్రచేస్తూ చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను అధిగమిస్తున్న చంద్రబాబు అధికారం చెపట్టిన వెంటనే రైతుల రుణాలను మాఫీ చేసే ఫైల్ మీద ముందు సంతకం చేస్తానని తెలిపారు. అలాగే మహిళలకు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని, బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని, నిత్యవసర సరుకుల ధరలకు కళ్ళెం వేస్తానని చెప్పారు. అంతే కాకుండా ప్రస్తుత ప్రభుత్వం సబ్సిడీని తగ్గించి ఇస్తున్న గ్యాస్ సిలిండర్లను 6 నుండి 10 కి పెంచుతామని అన్నారు. అర్హులైన నిరుద్యోగులందరికీ నెలకు 1000 రూపాయలు నిరుద్యోగ భతి చెల్లిస్తామని, యువతకు ఉపాధి అవకాశాలు పెంచుతామని వాగ్ధానం చేశారు. మాదిగల రిజర్వేషన్ కూడా తమ ఎజెండాలో ఉన్నట్లు చంద్రబాబు తెలిపారు. వాల్మీకులను యస్టీ జాబితాలో చేరుస్తామని, వడ్డెర్లకోసం 10 వేల కోట్లు కెటాయిస్తామని పాదయాత్రలో ప్రకటించారు.


