TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

స్కాట్లాండ్ తెలుగుదేశం ఎన్నారై విభాగం ప్రారంభం

Published on: Mon Jun 2, 2025 9:38AM

తెలుగుదేశం పార్టీ స్కాట్లాండ్ ఎన్నారై విభాగం ప్రారంభమైంది. మినీ మహానాడు 2025 తో ఘనంగా ఈ విభాగాన్ని ప్రారంభించారు.  ఎడిన్ బర్గ్ నగరంలోని అప్ హాల్ కమ్యూనిటీ సెంటర్ లో జరిగిన మినీ మహానాడు కార్యక్రమం లో తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు  పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.    తెలుగుదేశం పార్టీ విధానాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు.  కార్యక్రమం ప్రారంభం లో తెలుగుదేశం ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ జూమ్ ద్వారా ఎన్నారైలను ఉద్దేశించి ప్రసంగించారు.  

ఎన్టీఆర్ పాటించిన క్రమశిక్షణను అందరూ  పాటిస్తే అత్యున్నత విజయాలను అందుకోవచ్చన్నారు.  ఎన్టీఆర్ విలువలను ఎన్నారైలు వారి భావి తరాలకు తెలియచేయాలని సూచించారు. కార్యక్రమం లో పాల్గొన్న ఎన్నారైలు  తెలుగుదేశం పార్టీ ఆవశ్యకత, పార్టీ విధానాల వల్ల తాము ఏవిధం గా లబ్ది పొంది మంచి జీవితాలను గడుపుతున్నామో వివరించారు. అందుకు కృతజ్ఞతగా సోషల్ మీడియా వేదికగా తెలుగుదేశం పార్టీ కి తమవంతు సహకారాన్ని అందించి, తద్వారా పార్టీ ని బలోపేతం చేసి భావితరాలకు పార్టీ విధానాల ద్వారా లబ్ది చేకూర్చాలని సంకల్పించారు. అ

నంతరం కుర్రా అనిల్ కుమార్ , కార్తీక్ సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు.  కార్యక్రమం లో పొట్లూరి కృష్ణప్రసాద్, డాక్టర్ లావు శ్రీకాంత్ , డాక్టర్ దాసరి శ్రీనివాసరావు, షేక్ ఫర్జానా, మండవ మంజూష మరియు తెలుగుదేశం పార్టీ అభిమానులు పాల్గొన్నారు.