TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చేతులు కలిపన నామా,తుమ్మల

Published on: Sat Jul 21, 2012 11:05AM

రోజూ గొడవపడే వారైనా ఒక్కోసారి మనస్సు మార్చుకుని దగ్గరవుతారు. ఇది ప్రేమికులే కాదు నాయకులూ చేయగలరని తెలుగుదేశం పార్టీ ఖమ్మం జిల్లా నేతలు నామా నాగేశ్వరరావు, తుమ్మల నాగేశ్వరరావు నిరూపించారు. మొన్నటిదాకా తొడకొట్టి ఒకరిపై ఒకరు వీరంగం చేసిన ఈ ఇద్దరూ ఒక్కసారిగా మైత్రీబంధాన్ని పెంచుకున్నారు. దీనికి కారణం తెలిసిన వారందరూ ఆశ్చర్యపోక తప్పటం లేదు. ఒకే పార్టీలో ఉన్నా బద్ధశత్రువుల్లా మెలిగిన వీరిద్దరూ స్నేహానికి పునాది తెలుగుదేశం పార్టీ ఉప ఎన్నికల్లో ఓటమి కారణమైంది. ఆ ఓటమి తమ పార్టీ ఎంతలా నష్టపోతోందో వీరిద్దరికీ తెలిసేలా చేసింది.


 

దీంతో ఇక ఈ గొడవలకు పుల్‌స్టాప్‌ పెట్టాయాలని ఇద్దరూ నిశ్చయించుకుని విద్యుత్తు సరఫరాపై ఏర్పాటు చేసిన నిరసనకార్యక్రమంలో ఇద్దరూ ఒకే ఎద్దుల బండి ఎక్కేలా చేసింది. తాను ఎంపిగా ఎన్నికైన చాన్నాళ్లకు తుమ్మలతో కలిసి ఎడ్లబండెక్కానని నామానాగేశ్వరరావు కార్యకర్తలతో చెప్పారు. ఇక నుంచి కలిసే పని చేస్తామని తెలుగుదేశం పార్టీని జిల్లాలో బలోపేతం చేస్తామని వారిద్దరూ ముక్తకంఠంతో ప్రకటించారు. ఈ ప్రకటనపై ఖమ్మం జిల్లా తెలుగుతమ్ముళ్లు ఆనందం వ్యక్తంచేశారు.



    ఇది ఇలా ఉంటే తెలుగుదేశం పార్టీ అథినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్‌ కుటుంబసభ్యులతో ఉన్న విభేదాలను చాటుకుంటూనే ఉన్నారు. ఎన్టీఆర్‌ వారసులైన బాలకృష్ణ,హరికృష్ణ పార్టీలోనే ఉన్నా ప్రకటనలో వైరుధ్యం నారా కుటుంబంతో ఉన్న విబేధాలను చాటుతోంది.



ఈ విషయం రెండు కుటుంబాలు గమనించినా, బంధుత్వమున్నా కూడా సర్దుకోలేకపోయాయి. ఏ బంధుత్వమూ లేని నామా, తుమ్మల ఏకమై పార్టీ కోసం పని చేస్తామని ప్రకటిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు, బాలకృష్ణ కూడా మైత్రీ బంధాలను ప్రకటించాలని తెలుగుతమ్ముళ్లు కోరుకుంటున్నారు. కలిసి పని చేస్తే 2014లో అథికారం ఏమంత కష్టం కాదని గుర్తించాలని వారు కోరుతున్నారు.