మాజీ మంత్రి ముద్దసాని గుండెపోటుతో మృతి
Published on: Tue Apr 10, 2012 9:18AM
టిడిపి సీనియర్ నేత ముద్దసాని దామోదర్ రెడ్డి కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ, సోమవారం నాడు నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మృతిచెందారు. ఆయన కరీంనగర్ జిల్లా కమలాపురి నియోజక వర్గం నుంచి ఐదు సార్లు ఏమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. చంద్రబాబు, ఎన్టిఆర్ హయంలో మూడుసార్లు మంత్రి గా పని చేశారు. ముద్దసాని దామోదర్ రెడ్డి ప్రస్తుతం హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ గా పని చేస్తునాడు. ముద్దసాని భౌతికకాయాన్ని సోమవారం రాత్రి స్వగ్రామం మామిడాలపల్లికి తరలించారు. మంగళవారం అంత్యక్రియలు జరుగుతాయి. నిమ్స్‌లో ముద్దసాని మృతదేహాన్ని మంత్రులు, కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు సందర్శించి నివాళులర్పించారు. ముద్దసాని దామోదర్ మృతి పట్ల టిడిపి చంద్రబాబు సంతాపం ప్రటించారు.


