టీడీపీ ఎంపీలతో సోనియా.. మాడిపోయిన బీజేపీ మొహాలు..

 

కేంద్ర బడ్జెట్ లో ఏపీకి జరిగిన అన్యాయానికి గాను టీడీపీ ఎంపీలు గత నాలుగు రోజులుగా నిరసనలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈ విషయంపై ప్రధాని మాట్లాడిన చాలా తెలివిగా మాట్లాడి టాపిక్ ను పక్కదారి పట్టించడానికి ప్రయత్నించారు కానీ... ఆపప్పులేం ఉడకలేదు. ఏదో తెలుగు ప్రజలకు అన్నాయం జరిగిందని... మధ్యలో ఎన్టీఆర్ పేరును తీసుకొచ్చి నాలుగు పొగడ్తలు పొగిడి..పోరాటాన్ని తెలివిగా పక్కదారి పట్టించాలనుకున్నారు. తన ప్రసంగం మొత్తంలో కాంగ్రెస్ ను దుమ్మెత్తిపోసిన మోడీ..తాము మాత్రం ఏపీకి ఏం చేస్తామో అన్న విషయం చెప్పకుండానే ముగించారు ప్రసంగాన్ని. దీంతో టీడీపీ ఎంపీలు మరింత దూకుడుని పెంచారు.  మోడీ ప్రసంగం తర్వాత కూడా టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కేంద్రాన్ని ఓ రేంజ్ లో కడిగిపారేశారు.  అయితే ఆ మాటలతో సమస్య చల్లారిపోతుందని బీజేపీ భావించింది. కానీ టీడీపీ పోరాటంలో ఏ మార్పు లేదు. ప్లకార్డులు పట్టుకొని సేవ్ ఆంధ్రప్రదేశ్, సేవ్ డెమోక్రసీ అని నినాదాలు చేస్తూ తీవ్ర స్థాయిలో ఆందోళనలు గుప్పించారు. ఇక ఎప్పుడూ వినూత్నంగా నిరసనలు తెలిపే చిత్తూరు ఎంపీ శివప్రసాద్ ఇంకో అడుగు ముందుకెళ్లి సెక్రటరీ జనరల్ టేబుల్ మీదున్న పుస్తకాల్ని లాక్కోడానికి ప్రయత్నం చేశారు.

 

ఇదంతా ఇలా జరుగుతుంటే... మరోపక్క సోనియా గాంధీ టీడీపీ ఎంపీల ఆవేశం చూసి ఆశ్చర్యపోయారట. ఇంతలా ఆవేశం పడటానికి కారణం ఏంటో తెలుసుకోవాలని కేశినేని నానిని పిలిచి ఆంధ్రాలో పరిస్థితి గురించి అడిగారట. దీనికి నాని...విభజన హామీల అమలు చేయకపోవడం మీద ప్రజలు చాలా ఆగ్రహంగా ఉన్నారని తెలిపారట. అంతేకాదు.. ఇంకా ఏపీలో పరిస్థితుల గురించి నాని తో పాటు ఎంపీలు తోట నరసింహం, రామ్మోహన్ నాయుడు, రవీంద్రబాబు ఆమెకు వివరించారట. ఇదిలా ఉంటే సోనియాతో ఎంపీలు భేటీ అవ్వడం చూసి బీజేపీ నేతల మొహాలు మాడిపోయాయట. అంతేకాదు.. ఏపీ ఎంపీలతో మాట్లాడిన తరువాత  నాలుగు రోజులుగా స్పందించని కాంగ్రెస్ రూట్ మార్చింది.  ఏపీకి మద్దతిస్తూ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఏపీ విభజన చట్టం, హోదాపై చర్చ జరపాలంటూ లోక్ సభలో కాంగ్రెస్ పార్టీ నోటీసును ఇచ్చింది. రూల్ 184 కింద ఏపీకి స్పెషల్ స్టేటస్ పై చర్చతో పాటు ఓటింగ్ జరపాలంటూ లోక్ సభ సెక్రటరీ జనరల్ కు కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ మల్లికార్జున ఖర్గే నోటీసులు అందించారు. మరి అంతలా బాధపడేవాళ్లు ఏపీకి న్యాయం చేయాలని మాత్రం తెలియదు. పాపం బీజేపీ ఊహించకపోవచ్చు కాంగ్రెస్ ఏపీ ఎంపీలకు మద్దతిస్తుందని. మొత్తానికి సోనియా కూడా మద్దతివ్వడంతో   భవిష్యత్ రాజకీయ పరిణామాలు వేగంగా మారేలా కనిపిస్తున్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో...