మోడీ ఎస్కేపింగ్ ప్లాన్... లోక్ సభ వాయిదా..

 

ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ గత నాలుగైదు రోజుల నుండి టీడీపీ ఎంపీలు ఉభయసభల్లో ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈరోజు కూడా సభలు ప్రారంభమైన వెంటనే తెదేపా, వైకాపా ఎంపీలు స్పీకర్‌ పోడియం చుట్టుముట్టి నిరసన చేపట్టారు. స్పీకర్ ఎంత చెప్పినా వినకపోవడంతో.. స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. తిరిగి సమావేశాలు ప్రారంభమైనా.. పరిస్థితిలో మార్పు లేకపోవడంతో సభను ఏకంగా మార్చి 5కు వాయిదా వేశారు. అటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. తెదేపా, కాంగ్రెస్‌ సభ్యలు ఆందోళనతో మొదట 12 గంటలకు వాయిదా పడిన రాజ్యసభ తిరిగి ప్రారంభం కాగానే మరోసారి సభ్యులు నిరసనకు దిగారు. దీంతో మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేశారు.