అఘోరా వేషంతో ఎంపీ శివప్రసాద్..

 

ఎప్పుడూ వినూత్నంగా నిరసనలు తెలిపే చిత్తూరు ఎంపీ శివప్రసాద్ ఈరోజు మరో వినూత్న అవతారంతో పార్లమెంట్లో తన నిరసనను తెలిపారు. గత నాలుగు రోజులుగా టీడీపీ ఎంపీలు పార్లమెంట్ల్ లో ఏపీ న్యాయం చేయాలంటూ నిరసనలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో శివప్రసాద్ తలకు పోడవాటి వెంట్రుకల విగ్గు ధరించి, అఘోరా వేషం వేశారు. మెడలో రుద్రాక్షమాల, ఒక చేతిలో పాము, మరో చేతిలో నిమ్మకాయ గుచ్చిన కత్తిని పట్టుకుని నిరసన తెలిపారు. ఆయన వెనుక తెలుగుదేశం పార్టీ ఎంపీలు గల్లా జయదేవ్, మురళీమోహన్, మాగంటి బాబు తదితరులు ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు.