ఏపీని కాపాడమని రాష్ట్రపతిని కోరిన టీడీపీ నేతలు

టీడీపీ నేతలు గురువారం ఢిల్లీలో రాష్ట్రపతి రామనాథ్‌ కోవింద్‌ ను కలిశారు. గత 13 నెలలుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల గురించి వారు రాష్ట్రపతికి వివరించారు. ప్రతిపక్షాల నాయకులు, కార్యకర్తలపై దాడులు, తప్పుడు కేసులు, సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు, దళితులపై అమానుషాలు, మానవ హక్కుల ఉల్లంఘన వంటి వాటిని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్ళారు.

అనంతరం ఎంపీ రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. ఏపీ సీఎం జగన్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని, ఆయనకు అనుకులంగా ఉండే విధంగా మలుచుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో పౌరుల ప్రాథమిక హక్కులు కాలరాయడం, పేదల భూములు లాక్కోవడం, ప్రతిపక్షాలకు చెందిన వారిపై దౌర్జన్యాలు, ఆస్తుల ధ్వంసం, దళితులపై దాడులు తదితర విషయాలను రాష్ట్రపతికి వివరించామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడాలని రాష్ట్రపతిని కోరామని ఎంపీ రామ్మోహన్ చెప్పారు. దీనిపై రాష్ట్రపతి సానుకూలంగా స్పందిచారని, దీనిపై విచారణ చేసి తగు చర్యలు తీసుంటామని హామీ ఇచ్చారని ఎంపీ రామ్మోహన్ తెలిపారు. రోజు రోజుకు ఏపీలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని అందుకే తాము రాష్ట్రపతిని కలిసి అన్ని విషయాలు వివరించామన్నారు.