‘దొరల కుట్ర’ అంటూ రేవంత్ ఆరోపణల చిట్టా...

 

తెలంగాణ తెలుగుదేశం నాయకుడు రేవంత్ రెడ్డి తెలంగాణలో వనరుల మీద దొరల కుట్ర జరుగుతోందంటూ కొన్ని ఆరోపణలు చేశారు. ఆ వివరాలు..

 

* తెలంగాణలో వనరులు దోచుకోవడానికి దొరల కుట్ర జరుగుతోంది.

 

* మెట్రో రైలు భూమిని నందగిరి దొర మైహోమ్ రాజేశ్వరరావుకు కేటాయించడం నూటికి నూరుపాళ్ళు నిజం.

 

* ముఖ్యమంత్రి కేసీఆర్ బ్లాక్ మెయిలింగ్‌‌కి భయపడి మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఎల్ అండ్ టీ ఎండీ గాడ్గిల్ వాస్తవాలు దాచిపెడుతున్నారు. మొన్న గాడ్గిల్ చేసింది కూడా కేసీఆర్ చేయించిన బలవంతపు ప్రకటనే.

 

* మెట్రో రైలుకు కేటాయించిన 18 ఎకరాల స్థలం నుంచి వైదొలగితే తమకు నష్టమని, ఈ స్థలాన్ని మరొకరికి కేటాయించరాదనిఎన్వీఎస్ రెడ్డి గతంలో లేఖ రాస్తే అప్పటి సీఎం కిరణ్ కుమార్ ఈ విషయంలో ముందుకు వెళ్ళలేదు. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం మాత్రం రెండు వేల కోట్ల విలువైన స్థలాన్ని రామేశ్వరరావుకు ఉచితంగా కేటాయించింది. 26 కోట్ల స్టాంపు డ్యూటీని మినహాయించింది.

 

* తెలంగాణలో అభివృద్ధి జరగలాంటే దొరలు అవినీతికి పాల్పడకూడదు. సాటి దొరల కోసం కేసీఆర్ మెట్రోను పణంగా పెట్టడం అన్యాయం.