TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

ఫలించని టీడీపీ మంతనాలు.. పార్టీ మార్పు ఖాయం..

Published on: Sat Apr 28, 2018 1:08PM

 

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనను నమ్మించి మోసం చేశారని...  నారా లోకేష్ కూడా తనకు హామీ ఇచ్చి, దగా చేశారని చెప్పి తాను వైసీపీలోకి వెళుతున్నానని టీడీపీ ఎమ్మెల్యే కన్నబాబు చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో కన్నాని బుజ్జగించే పనిలో పడ్డారు టీడీపీ నేతలు. ఈ నేపథ్యంలో గంటా శ్రీనివాసరావు రంగంలోకి దిగి ఆయనను టీడీపీలోనే ఉండాలంటూ నచ్చజెప్పే ప్రయత్నం చేశారట. కానీ.. టీడీపీలో కొనసాగలేనని గంటాకు కన్నబాబు తేల్చేసి చెప్పినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన ఎలాంటి కండిషన్లు లేకుండానే 2014లో తాను టీడీపీలో చేరానని... అయితే, తనకు పార్టీలో సరైన గౌరవం దక్కలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన వయసు 65 సంవత్సరాలని... రాజకీయంగా ఇప్పుడు స్థిరపడకపోతే తన కుటుంబానికి గౌరవం కూడా ఉండదని చెప్పారు. వైసీపీలో చేరాలని తాను గట్టి నిర్ణయం తీసుకున్నానని... ఆ నిర్ణయాన్ని మార్చుకోలేనని స్పష్టం చేశారట. ఇదే విషయాన్ని గంటాకు కూడా చెప్పానని అన్నారు.