కన్నా, జగన్‌కు జలీల్ ఖాన్ సవాల్

 

సోషల్ మీడియా సెన్సేషన్ టీడీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్.. తాజాగా మాట్లాడుతూ పవన్ మీద విమర్శలు చేసారు.. అలానే కన్నా లక్ష్మీనారాయణ, జగన్ లకు సవాల్ విసిరారు.. జగన్ ఏపీకి సైతాన్‌లా తయారయ్యారని, తనను తాను రక్షించుకునేందుకు జగన్ పాదయాత్ర చేస్తున్నారని జలీల్ ఖాన్ మండిపడ్డారు.. సీఎం చంద్రబాబు అనుమతిస్తే కన్నా లక్ష్మీనారాయణపై తాను, జగన్ పైన తన కూతురు పోటీ చేస్తుందని చెప్పారు.. పవన్, జగన్, కన్నా లక్ష్మీనారాయణ చరిత్ర ఏమిటో ప్రజలకు తెలుసునని చెప్పారు.. పవన్ ఓ దొంగ అన్నారు.. ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు మెగా ఫ్యామిలీ ఏం చేసిందో అందరికీ తెలుసునని, పీఆర్పీని ముంచి మంత్రి తీసుకున్న చరిత్ర చిరంజీవిది అన్నారు.. మోడీ వద్ద ముగ్గురు దొంగలు కలిసి రాష్ట్రాన్ని ముంచుతున్నారని జలీల్ ఖాన్ మండిపడ్డారు.. అదే విధంగా బుద్ధా వెంకన్న కూడా పవన్ కి కౌంటర్ ఇచ్చారు.. లోకేష్ పైన పవన్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని చెప్పిన బుద్ధా, కాంగ్రెస్ పార్టీ నేత చిరంజీవి రాజ్యసభ ద్వారానే మంత్రి అయిన విషయం పవన్ మరిచిపోయారా అని ప్రశ్నించారు.