జగన్ తో కాశీ యాత్రకు మోడీ

 

ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ ప్రజా సంకల్ప యాత్రకు ముగింపు పలికిన సంగతి తెలిసిందే. కాగా ముగింపు సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో జగన్ చేసిన ప్రసంగంపై మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు విమర్శలు గుప్పించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..నిన్నటి జగన్‌ ప్రసంగంలో నిరాశ, నిస్పృహ స్పష్టంగా కనిపించిందన్నారు. అది సంకల్పయాత్ర ముగింపు కాదని.. వైకాపా ముగింపు యాత్ర అని అన్నారు. జగన్‌ ఇక కాశీయాత్ర చేసుకోవడం ఉత్తమం అన్నారు. అక్కడకు వెళితే మీరు స్నేహం చేసే మోడీ కూడా తోడవుతారని ఎద్దేవాచేశారు. గ్రామాల్లో పార్టీలకతీతంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతుంటే అబద్ధాలు ప్రచారం చేస్తారా? అని మండిపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై ఒక్క మాటైనా మాట్లాడారా? అని నిలదీశారు. జగన్‌ మాటల్లో ఒక్కటి కూడా వాస్తవం లేదని ఆరోపించారు. జగన్‌, కేసీఆర్‌, మోదీ కుమ్మక్కయ్యారని విమర్శించారు.