TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మహానాడు సభలో ఎమ్మెల్యే భర్త తీవ్ర భావోద్వేగం .. ఓదార్చిన సీఎం చంద్రబాబు

Published on: Thu May 29, 2025 7:58PM

 

కడపలో తొలిసారిగా తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మహానాడు మూడో రోజు భారీ బహిరంగ సభతో విజయవంతంగా ముగిసింది. ఈ సభ వేదికపై ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. వేదికపైకి చేరుకున్న పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఏర్పాట్లను చూసి సంతోషం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రెడ్డెప్పగారి శ్రీనివాస్‌ రెడ్డిని భుజం తట్టి సీఎం మెచ్చుకున్నారు. దీంతో శ్రీనివాస్ రెడ్డి ఆనందభాష్పాలతో చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. 

గత ఐదేళ్లలో కడప జిల్లాలో పార్టీ బలోపేతం కోసం ఆయన పడి కష్టం.. ప్రత్యర్థుల కుట్ర, చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను గుర్తు తలచుకోని శ్రీనివాస్‌ రెడ్డిని ఒక్కసారిగా కంటతడి పెట్టుకున్నారు. దీంతో ఆయనను చంద్రబాబు నాయుడు ఓదార్చారు. విపత్కర పరిస్థితులను ఎదుర్కొని నిలబడిన మాధవీ రెడ్డి దంపతులను అభినందించారు. ఈ సందర్బంగా కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి మాట్లాడుతు  తెలుగువాడి ఆత్మగౌరవం కోసం పట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు.కడప ఎమ్మెల్యే సీటు ఒక మహిళకు కేటాయించారని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేసుకున్నారు.