TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

టీడీపీ నేత పట్టాభిపై దాడి కేసులో రౌడీ షీటర్ అరెస్ట్!  ఏకంగా 180 కేసులలో నిందితుడు

Published on: Wed Feb 3, 2021 1:46PM

టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిపై బుధవారం అయన నివాసం సమీపంలో దాడి జరిగిన సంగతి తెల్సిందే. ఈ దాడి ఘటనతో ఏపీలో తీవ్ర రాజకీయ దుమారం రేగింది. అయితే పట్టాభిపై దాడి కేసులో విజయవాడ పోలీసులు కొక్కిరి జాన్ బాబు అనే రౌడీ షీటర్ ను తమ అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం. అతనిపై ఇప్పటికే పోలీసు రికార్డుల్లో ఒక రౌడీ షీట్ ఓపెన్ అయి ఉంది. దాదాపుగా 180 కేసుల్లో అతను ముద్దాయిగా ఉన్నట్లుగా సమాచారం. అంతేకాకుండా కొక్కిరి జాన్ బాబు పోలీసులు నగర బహిష్కరణ కూడా విధించారు.
 
పట్టాభిపై దాడి కేసులో నిందితులను పట్టుకునేందుకు విజయవాడ పోలీసులు పది బృందాలను నియమించారు. నిందితులను పక్కాగా గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.  టీడీపీ నేత పట్టాభిపై దాడి ఒక పథకం ప్రకారం జరిగిందని, ముందుగానే ఇంటి వద్ద కాపు కాసి మోటార్ బైక్ మీద వచ్చి దాడి చేసి పారిపోయారని పోలీసులు భావిస్తున్నారు. ఈ దాడి దృశ్యాలు పలు సీసీటీవీ ఫుటేజీల్లో రికార్డు అయ్యాయి.  దాడి జరిగిన తర్వాత పట్టాభిని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఈ దాడికి ముందు వైసిపి పైన, సీఎం జగన్ పైనా పట్టాభి తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో.. రాజకీయంగా ఇది  తీవ్ర వివాదానికి కారణమైంది.