జగన్ కు మ్యాటర్ వీక్...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జగన్ రెడ్డి పాలనపై మరోసారి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. వైసీపీ పాలనలో ఏపీ పరిస్థితి దారుణంగా తయారైందన్నారు. వైసీపీ పాలన చూస్తుంటే.. ‘పబ్లిసిటీ పీక్..మ్యాటర్ వీక్’ అంటూ లోకేష్ ఎద్దేవా చేశారు. దీనికి సన్నబియ్యమే ఒక ఉదాహరణగా చెప్పారు.  ఎన్నికల ముందు సన్నబియ్యం ఇస్తామని చెప్పారు.. అధికారంలోకి వచ్చిన తర్వాత సన్నబియ్యం కాదని.. నాణ్యమైన బియ్యం ఇస్తామన్నామని మాట మార్చారని విమర్శించారుయ 

ఇంటింటికి రేషన్ సరఫరా చేస్తామంటూ గొప్పలు చెప్పుకున్నారు.. వేల కోట్లు ఖర్చుచేసి వాహనాలు ఏర్పాటు చేశారు.. స్పీడుగా గ్రామాలకు పంపారు.. ప్రజలు ఛీ కొట్టారు.. మళ్లీ స్పీడుగా ఆ వాహనాలు తాడేపల్లి ప్యాలస్‌కు వచ్చాయని నారా లోకేష్ ఎద్దేవా చేశారు. అందుకే జగన్ రెడ్డి ప్రభుత్వానికి పబ్లిసిటీ పీక్..మ్యాటర్ వీక్ అని అన్నారు. ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను అడిగి.. అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టణ ప్రాంతాల్లో ఎక్కడా అభివృద్ధి జరగలేదని లోకేష్ విమర్శించారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 38.89 శాతం పంచాయతీలను తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు గెలుచుకున్నారని
చెప్పారు నారా లోకేష్.