మహిళా ఎస్సైని దూషించిన నన్నపనేని.. అరెస్ట్!!

 

టీడీపీ ‘ఛలో ఆత్మకూరు’ కార్యక్రమానికి పిలుపునివ్వడంతో పోలీసులు టీడీపీ అధినేత చంద్రబాబుని హౌస్ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. టీడీపీ శ్రేణులు చంద్రబాబు నివాసం వద్దకు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ శ్రేణులు పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. మరోవైపు టీడీపీ నేత, ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్మన్ నన్నపనేని రాజకుమారి, పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత కూడా చంద్రబాబు నివాసం వద్దకు చేరుకున్నారు. అయితే 144 సెక్షన్ విధించిన నేపథ్యంలో వీరిని అరెస్ట్ చేసిన పోలీసులు స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా నన్నపనేని రాజకుమారి స్థానిక మహిళా ఎస్సై అనురాధను దూషించారని తెలుస్తోంది. దీంతో కలత చెందిన ఎస్‌ఐ అనురాధ అక్కడి నుంచి వెళ్లిపోయారని సమాచారం.