TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చిక్కుల్లో టీడీపీ నేత కూన రవికుమార్

Published on: Mon May 25, 2020 1:29PM

టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ వివాదంలో చిక్కుకున్నారు. కూన వాహనాలు సీజ్ చేసినందుకు తనపై కక్షకట్టి బదిలీ అయ్యేలా చేశారని శ్రీకాకుళం జిల్లా, పొందూరు తహసీల్దార్ రామకృష్ణ ఆరోపిస్తున్నారు. అందుకు ఇదే సాక్ష్యమంటూ కూన రవికుమార్  ఫోన్‌లో దుర్భాషలాడిన ఆడియో క్లిప్ ను తహసీల్దార్ విడుదల చేశారు. ప్రస్తుతం ఆ ఆడియో జిల్లాలో హల్ చల్ చేస్తోంది. 

ఈ నెల 18న గోరింట గ్రామంలో కూన సోదరుడుకి చెందిన రెండు జేసీబీలు, నాలుగు టిప్పర్లు మట్టిని అక్రమంగా తవ్వి తరలిస్తుండగా.. వీఆర్వో సమాచారం మేరకు తహసీల్దార్ అక్కడకు చేరుకుని వాహనాలను సీజ్ చేశారు. దీంతో రవి కుమార్ తహసీల్దార్‌కు ఫోన్ చేసి దుర్భాషలాడుతూ బెదిరింపులకు పాల్పడ్డారు.

ఇది జరిగిన వారం రోజులకు తహసీల్దార్ రామకృష్ణ ఆకస్మిక బదిలీ అయ్యారు. క్వారంటైన్‌లో వసతుల విషయంలో తహసీల్దార్ చేతివాటం ప్రదర్శించారంటూ కూన జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన అధికారులు తహసీల్దార్ రామకృష్ణపై బదిలీ వేటు వేశారు. 

అయితే కూన సోదరుడుకి చెందిన వాహనాలు సీజ్ చేసినందుకు తనపై కక్షకట్టి బదిలీ అయ్యేలా చేశారని తహసీల్దార్ ఆరోపిస్తూ.. కూన రవికుమార్ ఫోన్‌లో దుర్భాషలాడిన ఆడియోను విడుదల చేశారు. ఇప్పటికే, కూనరవి మీద పొందూరు పీఎస్ లో తహశీల్దార్ ఫిర్యాదు చేసినట్టు సమాచారం.