టీడీపీ నేతకు షాక్.. జేబులో పేలిన ఫోన్...

 

ఈమధ్య కాలంలో స్మార్ట్ ఫోన్లు పేలిపోవడం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి ఘటనే ఇప్పుడు అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. అది కూడా ఓ టీడీపీ నేత జేబులో పేలింది. వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా బొమ్మనహాల్ మండల టీడీపీ కన్వీనర్ చలపతి తన శాంసంగ్ ఫోన్ ను జేబులో ఉంచుకున్నారు. అయితే అకస్మాత్తుగా అది పేలిపోయింది. చిన్నపాటి మంట, పొగ రావడంతో పాటు శబ్దం కూడా వచ్చింది. దీంతో ఆయన వెంటనే జేబులో నుంచి ఫోన్ ను తీసి, విసిరేశారు. ఈ ఘటనలో ఆయన చొక్కా కూడా కొంత కాలిపోయింది. సెల్ ఫోన్ పూర్తిగా కాలిపోయింది.