TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

గుడివాడ గొర్రె, గన్నవరం గొర్రెల డాక్టర్! వైసీపీ నేతలకు అయ్యన్న కౌంటర్ 

Published on: Wed Feb 3, 2021 2:52PM

టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిపై విజయవాడలో బుధవారం జరిగిన దాడి ఘటన ఏపీలో తీవ్ర దుమారం రేపుతోంది. జగన్ సర్కార్ వైఫల్యాలను ప్రశ్నిస్తుందుకే పట్టాభిపై హత్యా యత్నం చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే టీడీపీ ఆరోపణలపై స్పందించిన కొందరు వైసీపీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దాడి ఘటన తర్వాత జరిగిన పరిమాణామాలు చూస్తే.. దాడి వెనక టీడీపీ కుట్ర ఉందనే అనుమానాలు వస్తున్నాయని చెప్పారు. వైసీపీ నేతల వ్యాఖ్యలపై టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. 

వైసీపీ నేతలు,  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఓ రేంజ్ లో ఫైరయ్యారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు. పట్టాభి తన మీద తానే దాడి చేసుకున్నారని బులుగు గొర్రెలు మొరుగుతున్నాయని అయ్యన్న ట్వీట్ చేశారు. ముఖ్యంగా గుడివాడ గొర్రె, గన్నవరం గొర్రెల డాక్టర్ అని ఎద్దేవా చేశారు. వైజాగ్ ఎయిర్ పోర్ట్ లో, కోడికత్తితో గుచ్చుకుని "అమ్మా అంటూ బిగ్గరగా కేక వేసిన జగన్" అని ఆడిన డ్రామాల సంగతి ? ఏంటన్నారు  టీడీపీ సీనియర్ నేత. అధికారంలో ఉండి కూడా, ఆధారాలు లేకుండా, ఇలా గాలి ఏడుపులు ఏడుస్తారు కాబట్టే, మిమ్మల్ని గాలి మంద, ఫేక్ మంద అనేది అంటూ తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు అయ్యన్నపాత్రుడు.