టీడీపీకి మరో షాక్.. బీజేపీలోకి అంబికా!!

 

ఇటీవల టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ్యులు బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. మరికొందరు ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు కూడా టీడీపీని వీడబోతున్నారంటూ వార్తలొస్తున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా ఓ సీనియర్ నేత బీజేపీలో చేరబోతున్నారంటూ బాగా ప్రచారం జరుగుతోంది. ఆయన ఎవరో కాదు  సినీ నిర్మాత కమ్ వ్యాపారవేత్త అంబికా కృష్ణ. ఎన్నో ఏళ్లుగా టీడీపీకి సన్నిహితంగా ఉంటున్న ఆయన ఇప్పుడు పార్టీని వీడుతున్నారన్న వార్తలు వస్తుండంతో.. ఇంకా ఎంతమంది నేతలు బీజేపీ వైపు క్యూ కడతారా అని టీడీపీ అధిష్టానంలో ఆందోళన మొదలైంది.