TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రైతుల కుటుంబాలకు టీడీపీ సాయం

Published on: Tue Nov 18, 2014 4:46PM

 

తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ ఆర్థిక సహాయాన్ని అందజేసింది. మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆర్థిక సహాయం చెక్కులు పంపిణీ చేశారు. ఒక్కో కుటుంబానికి 50 వేల రూపాయల చొప్పన 150 కుటుంబాలకు చెక్కులు అందించారు. ఇదిలా వుండగా తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం నాడు మరో రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మెదక్ జిల్లా గజ్వేల్ మండలం కొడకండ్లలో ఓ రైతు అప్పుల బాధను తట్టుకోలేక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది. పూర్తి వివరాలు అందాల్సి వుంది.