TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జ‌గ‌న్ స‌ర్కారుపై టీడీపీ పోరుబాట.. విశాఖ జిల్లాలో తీవ్ర‌ ఉద్రిక్తత..

Published on: Wed Nov 24, 2021 3:03PM

టీడీపీ నేత‌లు రోడ్డెక్కారు. ఎప్ప‌టిలానే పోలీసులూ వ‌చ్చేశారు. తెలుగుదేశం నాయ‌కులు నిర‌స‌న ర్యాలీకి సిద్ధ‌మ‌య్యారు. య‌ధావిధిగా పోలీసులు అడ్డుకున్నారు. టీడీపీ లీడ‌ర్లు అయ్య‌న్న‌పాత్రుడు, వంగ‌ల‌పూడి అనిత‌లు రోడ్డుపైనే బైఠాయించారు. ఖాకీల‌తో తీవ్ర వాగ్వాదం జ‌రిగింది. ప‌రిస్థితి ఉద్రిక్తంగా మారింది. న‌ర్సీప‌ట్నం అట్టుడికిపోయింది. 

విశాఖ జిల్లా నర్సీపట్నంలో తీవ్ర ఉద్రిక్తత త‌లెత్తింది. అసెంబ్లీలో చంద్రబాబు కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నర్సీపట్నంలో ఆందోళన చేపట్టారు. మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు నివాసం నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు నిరసన  ప్రదర్శన చేపట్టాలని టీడీపీ శ్రేణులు నిర్ణయించారు. ర్యాలీకి అనుమతించని పోలీసులు మార్గ మధ్యలోనే తెలుగుదేశం నేత‌ల‌ను అడ్డుకున్నారు.  

పోలీసు వలయాన్ని దాటుకుని అయ్యన్నపాత్రుడు ముందుకు వెళ్లే ప్రయత్నం చేయగా.. పోలీసులు భారీగా మోహరించి అడ్డుకున్నారు. దీంతో  అయ్యన్నపాత్రుడు నడిరోడ్డుపైనే ధర్నాకు దిగారు.  నర్సీపట్నంతో పాటు పరిసర గ్రామాల నుంచి వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు అయ్యన్నకు మద్దతుగా ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనితతో పాటు, పలువురు సీనియర్ నాయ‌కులు ఆందోళనలో పాల్గొన్నారు. టీడీపీపై జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారు అనుచిత ధోర‌ణిపై అంతా మండిప‌డ్డారు.