టిడిపి బషీరుద్దీన్ బాబుఖాన్ మృతి
Published on: Mon Sep 16, 2013 9:50AM

తెలుగుదేశం పార్టీ మరో సీనియర్ నాయకున్ని కొల్సోయింది, గత కొంతకాలంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్న మాజీ మంత్రి బషీరుద్దీన్ బాబుఖాన్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బంజారాహిల్స్‌లోని ఆయన నివాసంలో కన్నుమూశారు.
తెలుగుదేశ్ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న బషీరుద్దీన్ ఎన్టీఆర్, చంద్రబాబు ప్రభుత్వాలలో వివిధ మంత్రిశాఖలు నిర్వహించారు. ఎన్టీఆర్, చంద్రబాబులకు అత్యంత సన్నిహితుడిగా కూడా బషీరుద్దీన్ బాబుఖాన్‌కు పూరుంది. కాని 1998లో ఆయన టిడిపి పార్టీకి రాజీనామా చేసి క్రియాశీల రాజకీయాలకు దూరమయ్యారు.
ఆయన మృతికి తెలుగుదేశం పార్టీతో పాటు ఇతర పార్టీల నాయకులు సంతాపం తెలిపారు. బాబుఖాన్ మృతితో మైనారిటీలతో పాటు బడుగు బలహీన వర్గాలకు ఓ అండపోయినట్టయిందని, వారికి కుటుంబానికి ప్రగాడ సానుభూతిని తెలియజేశారు.


