TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

టిడిపికి కాపుల అండ

Published on: Mon Sep 30, 2013 8:19PM

 

కేంద్రం తెలంగాణ ప్రకటించిన తరువాత అన్ని పార్టీల్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇన్నాళ్లు అధికార పార్టీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుందని భావించిన నేతలు కేంద్ర ఏమాత్రం వెనక్కి తగ్గకపోవటంతో ఇప్పుడు ఆ పార్టీ నాయకులు ఆలోచనలో పడ్డారు. ముఖ్యంగా కాపు సామాజికి వర్గానికి చెందిన చాలా మంది నేతలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ దిశగా అడుగులు వేస్తున్నారు.

ఈ దిశగా ఇప్పటికే పలువురు నేతలు తెలుగుదేశం పార్టీ అధినాయకత్వానికి సంకేతాలు పంపగా, మరి కొంత మంది అదే ఆలోచనలో ఉన్నారు. ముఖ్యంగా ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలో ఆ పార్టీకి పెద్ద ఎత్తున మద్దతు తెలిపిన కాపులు, ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయటంతో డైలామాలో పడ్డారు. అయితే ఇప్పుడు సమైక్య ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతున్న నేపధ్యంలో కొందరు నేతలు తమ భవిష్యత్ ఆలోచనలో పడ్డారు.

ముఖ్యంగా కోస్తా, రాయల సీమలలో స్థానిక రాజకీయాల్లో బలంగా ఉన్న కాపులు తెలుగుదేశంలో చేరే అవకాశా లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముందుగా చిరంజీవికి ప్రధాన అనుచరులలో ఒకరైన మంత్రి గంటా శ్రీనివాసరావు తన మాతృ సంస్థ అయిన తెలుగుదేశం పార్టీలో చేరుతారని కొంతకాలంగా బలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికలలో విజయం సాధించిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కూడా తెలుగుదేశం పార్టీలో చేరనున్నరన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.