టిడిపి గుర్రు..సభా సంఘాన్ని బహిష్కరించే యోచన
Published on: Sun Feb 12, 2012 12:33PM
హైద
రాబాద్: భూకేటాయింపులపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సభాసంఘంపై టీడీపీ పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎనబైకి పైగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల నుండి కేవలం ఇద్దరికే సభా సంఘంలో చోటు కల్పించడం పట్ల టిడిపి గుర్రుగా ఉంది. దీంతో సభా సంఘాన్ని బహిష్కరించే యోచనలో ఆ పార్టీ నేతలు ఉన్నారు. కనీసం నలుగురైదురికి చోటు కల్పించాల్సి ఉండేదని వారు భావిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సభా సంఘం అభ్యంతరకరంగా ఉందంటూ టిడిపి విప్ దూళిపాళ్ల నరేంద్ర స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు లేఖ రాయనున్నట్లు తెలుస్తోంది. విధివిధానాలు, ఎమ్మెల్యేల సంఖ్యను మార్చకపోతే సభా సంఘాన్ని బహిష్కరించేందుకే ఆ పార్టీ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. కాగా 2004 - 2009 మధ్య కాలంలో జరిగిన భూకేటాయింపులపై ప్రభుత్వం ఇటీవల సభా సంఘాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.


