TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

టిడిపికి బలమైన శక్తి యువతే బాబు

Published on: Thu Feb 9, 2012 1:37PM

విజయవాడ: టిడిపికి బలమైన శక్తి యువతే అని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గురువారం అన్నారు. కృష్ణా జిల్లాలోని విజయవాడలో జరిగిన యువతరంగం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన యువకులను ఉద్దేశించి మాట్లాడారు. అవినీతిరహిత భారతదేశం యువతతోనే సాధ్యమన్నారు. దేశంలో సగం మంది 25 ఏళ్ల లోపు ఉన్న వాళ్లేనని ఆయన అన్నారు. యువత రాజకీయాల్లోకి వస్తేనే రాజకీయాల్లో మార్పు కనిపిస్తుందన్నారు. యువత తల్చుకుంటే దేన్నైనా సాధిస్తారని అన్నారు. మంత్రుల అవినీతి కళ్ల ముందు కనిపిస్తున్నా వారు సిగ్గు లేకుండా పదవుల్లోనే కొనసాగుతున్నారని ధ్వజమెత్తారు. పోలవరం టెండర్ల ఫైళ్లు స్పీకర్ ముందు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ టెండర్ల ప్రక్రియలో అక్రమాలు జరిగాయన్నారు. వాటిని నిరూపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులంతా రాజీనామా చేయాలని ఆయన అన్నారు. కాగా యువతరంగం కార్యక్రమానికి భారీగా యువత తరలి వచ్చారు.