పార్టీకి ఒక్కరు దగ్గర,మరొకరు దూరం కాదు
Published on: Sat Jan 21, 2012 1:18PM
హైద
రాబాద్: తెలుగుదేశం పార్టీకి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరూ సమానమేనని పార్టీ వాణిజ్య విభాగం అధ్యక్షుడు అంబికా కృష్ణ అన్నారు. తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం అధ్యక్షుడిగా అంబికా కృష్ణ శనివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. పార్టీకి ఒక్కరు దగ్గర, మరొకరు దూరం అనేది ఏమీ లేదని, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరూ సమానమేనని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. ఎవరికి ఏ బాధ్యతలు అప్పగించాలనే విషయంపై పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు నిర్ణయం తీసుకుంటారని ఆయన చెప్పారు. బాలకృష్ణ ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది కూడా వారి నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటుందని ఆయన చెప్పారు. పన్నులు, వడ్డీలతో వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు.


