TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

టీడీపీ సైకిల్‌ రంగు మార్పు !

Published on: Wed Jan 11, 2012 1:21PM

హైదరాబాద్‌ : టీడీపీ సైకిల్‌ గుర్తు రంగు మారనుంది. నల్లని రంగు నుంచి టీడీపీ సైకిల్‌ ఆకుపచ్చ రంగులోకి మారనుంది. పార్టీ సభ్యులకు ఇచ్చే నమోదుకార్డులో ఈ మార్పు చేపట్టనున్నట్టు టీడీపీ ప్రకటించింది. ఇప్పటివరకూ పార్టీ సైకిల్‌ నల్లరంగులో ఉండేది. నలుపు రంగు తమకు కలిసి రావడం లేదనే ఆలోచనతో ఉన్న టీడీపీ నేతలు సైకిల్‌ రంగు మార్చే యత్నంలో పడ్డారు. పార్టీ ప్రధాన కార్యాలయమైన ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవనకూ ఎప్పుడూ వాస్తు మార్పులు చేసే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పార్టీ గుర్తుగా ఉన్న సైకిల్‌ రంగు మార్పుపై కూడా దృష్టి సారించడం చర్చనీయాంశమైంది. ఈ నెల 19 నుంచి పార్టీ సభ్యత్వ నమోదును కూడా పార్టీ ప్రారంభించి, వచ్చే నెల 19వ తేదీ లోపు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేయాలని పార్టీ నిర్ణయించింది.  మహిళలకు, యువతకు 30 శాతం ప్రాధాన్యత కల్పించాలని కమిటీ నిర్ణయించింది.  ఈనెల 19న ఆన్‌లైన్‌ సభ్యత్వ నమోదును బాబు ప్రారంభిస్తారు. క్రియాశీలక సభ్యులకు సభ్యత్వం తీసుకున్న 24 గంటల్లోపే గుర్తింపు కార్డులను జారీ చేయనున్నారు.