TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

గేరు మార్చిస్పీడ్ పెంచిన తెలంగాణ టిడిపి

Published on: Mon Jan 9, 2012 9:22AM

హైదరాబాద్ : తెలంగాణ తెలుగుదేశం నేతలు రాములమ్మ పుట్టుపూర్వోత్తరాలు వెతికేపనిలో పడ్డారు. ఇప్పటివరకు కెసిఆర్‌ను టార్గెట్‌ చేసిన తెలుగు తమ్ముళ్లు ఆయన పదోచెల్లెలు విజయశాంతి ఎక్కడ పుట్టిందో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మెదక్‌ ఎంపీది తెలంగాణ ప్రాంతం కాదని సీమాంధ్ర నుంచి వలస వచ్చిందని అంటున్నారు.తెలంగాణ టిడిపినేతలు దూకుడు మరింత పెంచారు, టీఆర్ఎస్ పై దాడిని తీవ్రతరం చేశారు. కొంత కాలంగా టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ టార్గెట్గా రెచ్చిపోయిన నేతలు , ఇపుడు ఎంపి విజయశాంతి లక్ష్యంగా స్వరం పెంచారు. చంద్రబాబు వరంగల్ టూర్ పై విమర్శలు చేసిన జయశాంతిపై తీవ్రమైన ఆరోపణలు చేశారు.ఆంధ్రా ప్రాంతనుంచి వలసవచ్చిన వియశాంతి తెలంగాణ ఉద్యమం పేరుతో డ్రామాలాడుతుందని టిటిడిపి ఫోరం చైర్మెన్ ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు.

విజయశాంతి తెలంగాణవాది అయితే తన కుటుంబికుల వివరాలు చెప్పాలని ఎర్రబెల్లి డిమాండ్ చేశారు.అటు టిడిపి మహిళా నేత శోభారాణి విజయశాంతిపై  విరుచుకుపడ్డారు. ఉద్యమం పేరుతో కోట్లాది రూపాయలు గడిస్తూ ,తెలంగాణ ప్రజలను దగా చేస్తున్నారని ఆరోపించారు. నోటిని అదుపులో పెట్టుకోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని ఆమె హెచ్చరించారు.మరోవైపు టిడిపి,టీఆర్ఎస్ నేతల మధ్య నెలకొన్న పొలిటికల్ వార్ రూట్ మారుతుండటంతో పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి. ఇవి ఎటువైపు దారి తీస్తాయోనని రాజకీయ విశ్లేషకులు ఆందోళన చెందుతున్నారు.