TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

టీడీపీ నేత హత్యపై కేసులు నమోదు

Published on: Mon Dec 19, 2011 11:09AM

ఖమ్మం: ఆదివారం దారుణ హత్యకు గురైన తెలుగుదేశం పార్టీ నేత చిట్టి బాబు హత్య కేసులో ఖమ్మం జిల్లా నేలకొండపల్లి పోలీసులు ఏడుగురిపై కేసు నమోదు చేశారు. భద్రాద్రి ఐరన్ ఓర్ ఫ్యాక్టరీ యజమాని శ్రీనివాస రావు, కాంట్రాక్టర్ దీపక్‌తో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేశారు. ఆదివారం ఉదయం స్పాంజ్ ఐరన్ ఓర్ అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం అందుకున్న స్థానిక టిడిపి నేత చిట్టిబాబు మరికొందరితో కలిసి వాహనాలను అడ్డుకున్నారు. అక్రమ తరలింపు జరగనివ్వమని హెచ్చరించారు. డ్రైవర్లు, చిట్టి బాబుకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వాగ్వాదం ముదిరి డ్రైవర్లు ఇనుప రాడ్‌లతో చిట్టి బాబును దారుణంగా కొట్టారు. అతను అక్కడికక్కడే మృతి చెందాడు. చిట్టి బాబు మృతికి కారణమైన దోషులను కఠినంగా శిక్షించాలని టిడిపి డిమాండ్ చేసింది. పోలీసులు కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని తమకు న్యాయం జరగకపోతే పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళన చేస్తామని హెచ్చరించారు.