TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పార్లమెంటులో తెలుగుదేశం ఆవిర్భావ వేడుకకు నడ్డా

Published on: Wed Mar 29, 2023 4:49PM

పార్లమెంటు ఆవరణలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి.  పార్లమెంటులో ఎన్టీ ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసిన  టిడిపి ఎంపీలు గల్లా జయదేవ్, కేశినేని నాని, కనకమేడల కేక్ కట్ చేసి పార్టీ ఆవిర్భావ  వేడుకలు నిర్వహించారు.

అనూహ్యంగా ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా హాజరయ్యారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన తెలుగుదేశం ఎంపీలకు అభినందనలు తెలియజేశారు.  వాజ్ పేయి హయాంలో టిడిపి,  బిజెపి అనుబంధాన్ని తెలుగుదేశం ఎంపీలు నడ్డాకు వివరించారు.

 బీజేపీ, తెలుగుదేశం   స్నేహ సంబంధాల గురించి తనకు తెలుసునని నడ్డా ఈ సందర్భంగా అన్నారు. ఇటీవల అండమాన్ మేయర్ ఎన్నికల్లో టిడిపి బిజెపి పొత్తుపై నడ్డా ప్రస్తావించారు.