TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మ‌గాడివైతే పెట్టు.. ఉద్యోగిపై వైసీపీ నేత బూతుపురాణం!.. ఆడియో వైర‌ల్‌..

Published on: Mon Jan 31, 2022 11:14AM

వైసీపీ నేత‌లంటేనే బూతులు మాట్లాడే నాయ‌కుల‌ని ఫిక్స్ అవుతోంది. దాదాపు ఏ నాయ‌కుడు నోరు తెరిచినా.. అస‌భ్య మాట‌లే. మంత్రుల నుంచి కార్య‌క‌ర్త‌ల వ‌ర‌కూ.. నోటికొచ్చిన‌ట్టు మాట్లాడుతున్నారు అధికార పార్టీ వాళ్లు. అలా మాట్లాడ‌టం గొప్ప అనుకుంటున్నారో ఏమో. ఏదో విపక్షాల‌పై నోరు పారేసుకుంటున్నారంటే అదే వేరే విష‌యం. ప్ర‌భుత్వ ఉద్యోగుల‌ను సైతం ఎలా ప‌డితే అలా తిడుతుండ‌టం వారి ఓవ‌రాక్ష‌న్‌కు నిద‌ర్శ‌నం..అంటున్నారు. లేటెస్ట్‌గా.. అనంత జిల్లాలో ఓ ఉద్యోగిపై వైసీపీ నాయ‌కుడి తిట్ల‌దండ‌కం క‌ల‌క‌లం రేపింది. 

మరో వైసీపీ నేత బూతుపురాణం తాజాగా వెలుగు చూసింది. రాప్తాడు నియోజకవర్గంలోనూ రాజ‌కీయ అల‌జ‌డి చెల‌రేగింది. జియాలజిస్ట్‌ కురుబ నారాయణస్వామిని రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి అనుచరుడు అమర్నాథ్‌రెడ్డి అసభ్య పదజాలంతో దూషించారు. ఆ అమర్నాథ్‌రెడ్డి ప్ర‌స్తుతం కనగానపల్లి వైసీపీ మండల కన్వీనర్‌గా ఉన్నారు. 

తనకు చెప్పకుండా మండలంలోకి అడుగుపెడతావా అంటూ ఆ ఉద్యోగిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నువ్వు మగాడివైతే నా మండలంలోకి అడుగుపెట్టు.. నీ సంగతి చూస్తా’ అంటూ జియాలజిస్ట్‌ నారాయణస్వామిని బెదిరించాడు. ఇంకా అస‌భ్య ప‌ద‌జాలం వాడారు. వైసీపీ నేత‌ అమ‌ర్నాథ‌రెడ్డి బెదిరింపుల ఆడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. అస‌లే పీఆర్సీ మంట‌తో ర‌గిలిపోతున్న ప్ర‌భుత్వ ఉద్యోగులు.. ఇప్పుడిలా వైసీపీ నేత‌ల బూతుపురాణంపై మ‌రింత మండిప‌డుతున్నారు.