జగన్ పార్టీలోకి కాటసాని

 

katasani ram reddy, ysr congress katasani ram reddy

 

 

కర్నూలు జిల్లా బనగానపల్లి ఎమ్మెల్యే కాటసాని రాంరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. 2009 సాధారణ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ నుండి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. జిల్లాలో ఆళ్లగడ్డ నుండి శోభా నాగిరెడ్డి, బనగానపల్లి నుండి కాటసాని రాంరెడ్డిలు ప్రజారాజ్యం తరపున ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఆ తరువాత రాంరెడ్డి జగన్ కు సన్నిహితంగా మారి ఆ పార్టీకి దగ్గరయ్యారు.

 

ఇక శోభానాగిరెడ్డికి, వైఎస్ జగన్ మేనమామ రవీంధ్రనాథ్ రెడ్డికి చుట్టరికం కారణంగా ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం కావడంతో భూమా దంపతులు జగన్ పార్టీలోకి వెళ్లిపోయారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున శోభా నాగిరెడ్డి మళ్లీ ఎన్నికయ్యారు. అయితే జగన్ కు దగ్గరయిన కాటసాని తిరిగి చిరంజీవి చేరువయ్యారు. ఇప్పుడు మళ్లీ యూ టర్న్ తీసుకుని తిరిగి జగన్  పార్టీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు.