తారా, పాల్ తరువాత జగనేనా?
Published on: Fri Jun 1, 2012 9:58AM
సెక్స్ రాకెట్ నడిపిన తారా చౌదరికి, సోదరుని హత్యకేసులో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె.ఎ.పాల్ కు బెయిల్ మంజూరైంది. వీరిద్దరి తరువాత వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ కు కూడా బెయిల్ మంజూరయ్యే అవకాశాలున్నాయని న్యాయనిపుణులు చెబుతున్నారు. తారా చౌదరికి నాంపల్లి కోర్టు, కె.ఎ.పాల్ కు రాష్ట్ర హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరయ్యాయి. వీరిద్దరి తరువాత జగన్ కు బెయిల్ మంజూరైతే ఉప ఎన్నికల ప్రచారంలో నిర్థేశిత గడువులో పాల్గొనేందుకు హెలికాఫ్టర్ కూడా వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నాయకులు సిద్ధం చేశారు. వీరి ఏర్పాట్లను పరిశీలిస్తే జగన్ బెయిల్ ను పొందటానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకున్నట్లుంది. అంతేకాకుండా ప్రచారంలో విమర్శల వేడి కూడా పెరిగే అవకాశాలున్నాయి. దీంతో పాటు జగన్ బెయిల్ పై బయటికి వస్తే కాంగ్రెస్ నుంచే కనీసం పదిమంది ఎమ్మెల్యేలు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకు వలస వస్తారని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.


