తారా చౌదరి వీడియో టేపుల్లో ఎవరి పేర్లు ఉన్నాయ్?
Published on: Sat Apr 14, 2012 10:54AM
సినీ నటి తారా చౌదరి నివాసంలో హైదరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆడియో, వీడియో టేపుల్లో ఎవరి పేర్లు ఉన్నాయో తెలియక వీఐపీలు బయపడుతున్నారు. ఈ కేసులో ఇప్పటికే గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు గారి పేరు బయటకు రాగా, తమ పేర్లు ఎక్కడ బయటపడతాయోనన్న భయంతో కొదరు ఉన్నట్టు సమాచారం. ఎలాగైన తార నుంచి తమ పేర్లు బయటికి రాకుండా చూసుకోవడానికి శక్తి మేరకు ప్రయత్నిస్తున్నారు. యువతులతో వ్యభిచారం చేయించిన తీరు.... ప్రముఖులను బ్లాక్‌మెయిల్ చేసిన విషయాలను పూసగుచ్చినట్లు చెప్పింది. అన్ని విషయాలూ ఇప్పుడు బయటపడడంతో.. రాయపాటి తర్వాత ఎవరి పేరు బయటికొస్తుందోనని అంతా టెన్షన్‌లో ఉన్నారు. మరోవైపు వ్యభిచారం కేసులో అరెస్టు అయిన తారాచౌదరికి కాస్త ఊరట లభించింది. రెండు కేసులో ఆమెకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మరో కేసులో వాదనలు పూర్తి కాగా, తీర్పును వాయిదా వేసింది.


