TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తారా చౌదరి ఉచ్చులో గుంటూరు నేతలు

Published on: Tue Apr 3, 2012 4:58PM

tara chowdary, tara chowdary sex racket, tara chowdary brothel, tara chowdary guntur district,  tara chowdary arrest, regional news తారాచౌదరి సెక్స్ రాకెట్ ప్రభావం గుంటూరు జిల్లాపై కూడా పడింది. ఈమె వలలో గుంటూరుజిల్లాకు చెందిన కొందరు ప్రజాప్రతినిధులు చిక్కుకుని విలవిలాలాడుతున్నట్లు తెలుస్తోంది. అసాంఘిక కార్యకలాపాల వ్యవహారంలో సూత్రధారిగా అభియోగాలు ఎదుర్కొంటున్న తారాచౌదరిపై గుంటూరు పోలీస్ స్టేషన్ లోనూ ఫిర్యాదులు ఉన్నాయి. రాజధానిలో నమోదైన కేసుల ఆధారంగా ఆమెపై ఇప్పటికే పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ విచారణలో భాగంగా గుంటూరులోని తారాచౌదరి ఇంటిపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు జరిపి అనేక సీడీలు, కెమెరాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో గుంటూరు జిల్లాకు చెందిన ఒక ఎంపి, రెండున్నర సంవత్సరాల పాటు ఉన్నత పదవి నిర్వహించిన ఆయన తనయుడు ఇద్దరూ చౌదరికి క్లయింట్లుగా ఉన్నారని తెలిసింది. ఎంపి తనయుడ్ని చౌదరి తన గుప్పెట్లో ఉంచుకుని బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు పోలీసు విచారణలో తేలింది. గుంటూరుజిల్లాకు చెందిన ఒక పారిశ్రామికవేత్తను కూడా తారాచౌదరి ఇలాగే బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు తెలిసింది. రాయలసీమకు చెందిన ఒక మంత్రి కూడా చౌదరి వలలో చిక్కుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో గతంలో గుంటూరులో ఆమెతో సన్నిహితంగా మెలిగిన నేతల్లో వణుకు ప్రారంభమైంది. పోలీసులకు దొరికిన సీడిల్లో తమకు సంబంధించిన ఆధారాలు ఏమైనా ఉన్నాయేమోనన్న భయంతో ఆ నాయకులు ఆరాలు తీస్తున్నట్లు తెలుస్తోంది.