తమ్మినేనిని స్పీకర్ చైర్ వద్దకు తీసుకెళ్లిన జగన్.. మరి చంద్రబాబు?
Published on: Thu Jun 13, 2019 11:38AM

ఈ రోజు ఉదయం ఏపీ అసెంబ్లీలో స్పీకర్ ఎన్నిక జరిగింది. ఆరుసార్లు అసెంబ్లీకి ఎన్నికైన తమ్మినేని సీతారాం స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికకాగా, ఆయన్ను సీఎం వైఎస్ జగన్ తో పాటు పలువురు అధికార, విపక్ష సభ్యులు అభినందించారు. జగన్ స్వయంగా తమ్మినేనిని స్పీకర్ చైర్ వద్దకు తీసుకువెళ్లారు. అయితే ఆ సమయంలో విపక్ష నేత, టీడీపీ శాసనసభాపక్ష నాయకుడు చంద్రబాబు సభలో కనిపించలేదు. ఆయన రాకపోవడంతో ఆ పార్టీ మరో నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు.. తమ్మినేనితో పాటు స్పీకర్ స్థానం వద్దకు నడిచి, ఆయనకు అభినందనలు తెలిపారు. కాగా, తమ్మినేని సీతారాం ఎన్నిక తరువాత చంద్రబాబు అసెంబ్లీకి వచ్చారు.


